విశాఖపట్నానికి అన్ని అర్హతలు ఉన్నాయని దీనిని ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు .గతంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గంటా శ్రీనివాసరావు కూడా మంత్రిగా ఉన్న విషయాన్ని వాళ్లు గుర్తిస్తున్నారు. అప్పుడు గుర్తురాని ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు . గంటా శ్రీనివాసరావు కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారే తప్ప నిజంగా ఎలాంటి సదుద్దేశం లేదని నిజంగా అదే ఉంటే గత ప్రభుత్వ హయాంలోనే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించి ఉండేవారని ప్రజలు అంటున్నారు . కేవలం కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై నిందలు వేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని గంటా శ్రీనివాసులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు . తమకు అవకాశం ఉన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు చేయమని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు .
అప్పుడు ఎందుకు చేయలేదు గంటా ...